Raitu Bharosa : ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ రైతు భరోసా పోస్టర్ వార్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-07 05:49:47.0  )
Raitu Bharosa : ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ రైతు భరోసా పోస్టర్ వార్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) టార్గెట్(Target) గా బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా(Raitu Bharosa) అస్ర్తంగా చేసుకుని నిర్వహిస్తున్న ప్రచార దాడిPropaganda attackని ఢిల్లీకి మళ్లించింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలో రైతు భరోసా ఎకరాకు 15వేలు ఇస్తామని చెప్పి..ఇప్పుడు 12వేలు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన పోస్టర్ వార్ (Poster War)కు ఢిల్లీని వేదికగా చేసుకుంది.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం(AICC office in Delhi) వద్ద రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ శ్రేణులు పోస్టర్లు అంటించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో గులాబీ వారియర్స్ వైరల్ చేస్తున్నారు. ఎకరాకు 15వేల రైతు భరోసా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారాని..2024లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశారని, ఇప్పుడు 12వేలు ఇస్తామని యూటర్న్ తీసుకుందని పోస్టర్లలో బీఆర్ఎస్ విమర్శలు చేసింది.

రైతు భరోసా హామీ మార్పులను అస్త్రంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇటు ప్రజాక్షేత్రంలో..అటు కాంగ్రెస్ అధిష్టానం వద్ధ రాజకీయంగా దెబ్బతీసే ద్విముఖ వ్యూహాంలో భాగంగా బీఆర్ఎస్ పోస్టర్ వార్ కొనసాగిస్తుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed