- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో పోస్టర్ల కలకలం.. షాక్‌లో కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్ది మునుగోడు రాజకీయం రంజుగా మారుతోంది. పోలింగ్‌కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉండటంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసి మంగళవారం ఉదయాన్నే ప్రచారం షురూ చేసిన బీజేపీ నేతలకు అనూహ్య షాక్ తగిలింది. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలో గుర్తు తెలియని పోస్టర్లు కలకలం రేపాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మండలంలో పోస్టర్లు వెలిశాయి. 'ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే' అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు అతికించారో తెలియరాలేదు. గత కొంతకాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరాడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. మరి ఈ పోస్టర్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి : రాజకీయ రణక్షేత్రం మునుగోడులో గెలుపెవరిది?