- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాంధీ భవన్ ముందు పొన్నం అనుచరుల ధర్నా
దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ హైకమాంట్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికల కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. కమిటీలో పలువురు సీనియర్ నాయకులకు స్థానం దక్కలేదు. దీంతో వారంతా తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారు. తాజాగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు గాంధీ భవన్ ఎదుట ధర్నాకు దిగారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన తమ నాయకుడిని కమిటీలోకి తీసుకోకుండా అవమానించారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ ను కమిటీలోకి తీసుకోకుండా కొందరు సీనియర్ నాయకులు కుట్రలు పన్నారని ఆరోపించారు. తమ నాయకుడు పొన్నం ప్రభాకర్ ను వెంటనే ఎన్నికల కమిటీలోతి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా కాసేపట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుండగా పొన్నం అనుచరుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.