- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ponnam Prabhakar: గురుకులాల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు.. మంత్రి పొన్నం ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీసీ,ఎస్సి,ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, హాస్టల్‌లు, తరగతి గదులు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పోన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇందులో రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
పిల్లలకి అస్వస్థతగా ఉన్నా ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలని, పిల్లలకు ఎప్పటికప్పుడు హైట్, వెయిట్ చెక్ చేసి వివరాలను రికార్డు చేయాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించడంతో పాటు ఆహారం వండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇక పరిసరాల శుభ్రత, తరగతి గది, హాస్టల్ గది శుభ్రతపై పిల్లలకి అవగాహన కల్పించాలని, పిల్లలకు హిమోగ్లోబిన్, విటమిన్-డి లాంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే పాఠశాల ఆవరణలో శుభ్రంగా ఉంచాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌లను ఆదేశించించడం జరిగిందన్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలను పర్యవేక్షించాలని మంత్రి పొన్నం తెలిపారు.