Ponnam: బీసీలకు నిధులపై చర్చకు సిద్దమా..? మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్

by Ramesh Goud |
Ponnam: బీసీలకు నిధులపై చర్చకు సిద్దమా..? మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: గత పదేళ్లలో బీసీలకు(BCs) ఖర్చు చేసిన నిధులపై(Funds) చర్చకు సిద్దమా..? అని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(minister Ponnam Prabhakar) సవాల్(Challenge) విసిరారు. తెలంగాణలో శాసన సభ, మండలి సమావేశాలు(Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కుల భవనాల నిర్మాణంపై మండలిలో(Council) ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నను లేవనెత్తారు. దీనికి మంత్రి పొన్నం సమాధానం ఇస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) పదేళ్ల పాలనలో బీసీలకు కేటాయించింది 8 వేల కోట్లు అయితే.. అందులో విడుదల చేసిన నిధులు కేవలం 2 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు.

అంతేగాక విడుదల చేసిన వాటిలో కూడా ఖర్చు పెట్టింది కేవలం 800 కోట్లు మాత్రమేనని, అవి కూడా 2018-19లో 200 కోట్లు 2023-24 బీసీ బంధు కోరకు 600 కోట్లు ఖర్చు చేశారని, ఇవి తప్ప బీసీల పథకాల కోరకు కానీ, బీసీల సంక్షేమం కొరకు కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. దీనిపై సభలో చర్చకు ఎవరొచ్చినా సిద్దమేనని ప్రతిపక్షాలకు ఛాలెంజ్ చేశారు. అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Decleration)కు కట్టుబడి ఉన్నామని, తప్పకుండా సాంక్షన్ చేసిన 42 కుల భవనాలను నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. బీసీ కులాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దీని కోసమే కులగణన చేస్తున్నామని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story