స్మశాన వాటికకు దారేది..?

by Aamani |
స్మశాన వాటికకు దారేది..?
X

దిశ,గంభీరావుపేట : ఏళ్ల తరబడి గ్రామాలలో స్మశాన వాటికలకు సరైన స్థలం లేక వాటికి అవసరమైన సరైన సౌకర్యాలు లేక గ్రామీణ గిరిజన తండా వాసులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.కాగా గత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామీణ ప్రాంతంలో స్మశాన వాటికల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో పల్లె పల్లెనా స్మశాన వాటికల నిర్మాణం జరిగిన వాటి వినియోగం మాత్రం చాలా గ్రామాల్లో కనిపించడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గ్రామీణ ప్రాంతాల్లో పాటు గిరిజన తండాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన స్మశాన వాటికలో ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించిన అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉండటం క్షేత్రస్థాయిలో అధికారులు పట్టింపులేని తనంగా వ్యవహరించడంతో, పేరుకే స్మశాన వాటికలు ఉన్నట్లుగా ఉంది. ఊరికి కిలోమీటర్ దూరంలో కనీస సౌకర్యాలు కూడా లేని స్థలాల్లో వాటికి కేటాయించిన నిధుల విడుదల కోసం నామమాత్రంగా నిర్మించి గత నాయకులు చేతులు దులుపుకున్నారు అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎక్కడ కనిపించడం లేదు.

కనీస సౌకర్యాలు, స్మశాన వాటికకు దారి లేక...

మండలంలోని ఆయా గ్రామాలలో స్మశాన వాటికలు నిర్మించిన నుంచి ఇప్పటికి వినియోగంలో లేకపోవడం కనీస సౌకర్యాలు లేక దహన సంస్కరణాలు చేసేది ఒక్క దగ్గర అనంతరం స్థానాల కోసం నిర్మించిన గదులు ఒక దగ్గర ఉండటం కొన్నిచోట్ల దహన సంస్కరణలు జరిగిన తరువాత ఉపయోగించే కనీస నీటి సౌకర్యాలు కూడా లేకపోవడం నిర్మించిన స్మశాన వాటికకు దారి లేకపోవడం గమనార్హం. వీటి నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ సరిగలేక ఈ తప్పులు జరిగాయని ప్రభుత్వం కేటాయించిన నిధులతో నామమాత్రంగా స్మశాన వాటికలు నిర్మించిన ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ గ్రామాన ప్రభుత్వం నిర్మించిన పథకాలు అమల్లో ఉండి వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు పంచాయతీ అధికారులను పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed