Minister Ponguleti Srinivasa Reddy : పెదవాగు ఘటన దురదృష్టకరం..

by Sumithra |
Minister Ponguleti Srinivasa Reddy : పెదవాగు ఘటన దురదృష్టకరం..
X

దిశ, అశ్వారావుపేట : రికార్డ్ స్థాయి వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టును సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడారు.. ఊహించని పెను విపత్తు.. ఇరిగేషన్ శాఖ కింది స్థాయి ఉద్యోగుల తప్పిదాలతో పెద్దవాగు ప్రాజెక్టు కాపాడుకోలేకపోయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వరదల్లో చిక్కుకున్న వారిని 41 మందిని రక్షించుకోగలిగామన్నారు. ప్రజా ప్రభుత్వంలో వరద బాధితులను ఆదుకునేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 400 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు. ఇసుక మేటలు వేసిన పొలాలకు రూ. 10 వేలు నష్టపరిహారం ఇస్తామన్నారు. నారుమళ్ళు, పత్తి పలు విత్తనాలు వేసిన వారికి.. తిరిగి ప్రభుత్వం నుంచి విత్తనాలను ఉచితంగా అందిస్తామన్నారు.

వరదల్లో కొట్టుకుపోయిన పశువులకు రూ. 10 వేలు, గొర్రెలు మేకలకు రూ. 3 వేలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. వరద ధాటికి పాడైన రోడ్లు, విద్యుత్, పంచాయతీ రాజ్ పనులకు రూ. 8.50 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేసినట్లు తెలిపారు. తన తండ్రి పొంగులేటి రాఘవరెడ్డి ట్రస్ట్ తరఫున పెదవాగు వరదలకు దెబ్బతిన్న పూరిండ్లకు రూ.10 వేలు స్లాబ్ ఇంటికి రూ. 5 వేలు వ్యక్తిగత ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వరదలకు ఇల్లు కోల్పోయిన వారికి సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. స్థానిక రైతులు రైతు కూలీలు ధైర్యంగా ఉండాలని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అన్ని విధాల అండగా ఉంటామని పొంగులేటి భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed