భువనగిరిలో కాలుష్యం దారుణం: ఎంపీ చామల

by Satheesh |
భువనగిరిలో కాలుష్యం దారుణం: ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో: భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాలుష్యం పెరిగిపోయిందని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి సోమవారం పార్లమెంట్‌లో ప్రశ్నించారు. దీని వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర కాలుష్య మండలిపై ఉన్నదని గుర్తు చేశారు. ఫార్మా, రసాయన పరిశ్రమల ద్వారా నిరంతర కాలుష్యం వెలువడుతుందని, సుమారు 10-15 రసాయన పరిశ్రమలు విడుదల చేసే రసాయన కారకాల వలన భూగర్భ జలాలు కాలుష్యం కావడమే కాకుండా, గాలి కూడా పొల్యూట్ అవుతుందని వివరించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చౌటప్పల్, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన పోచంపల్లి మండలాలలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కంపెనీలపై నిత్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్ర బోర్డు రంగంలోకి దిగి వాతావరణాన్ని కాపాడాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed