సిటీలో మందకోడిగా పోలింగ్.. సికింద్రాబాద్ లో 14.77 శాతం పోలింగ్ నమోదు

by Anjali |
సిటీలో మందకోడిగా పోలింగ్.. సికింద్రాబాద్ లో 14.77 శాతం పోలింగ్ నమోదు
X

దిశ, సిటీ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హైదరాబాదులో నిర్వహించిన పోలింగ్ మందకోడిగా కొనసాగుతుంది. ఉదయం ఐదున్నర గంటలకు మాకు పోలింగ్ నిర్వహించిన తర్వాత 7 గంటల నుంచి సాధారణ పోలింగ్ నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ స్టేషన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎన్బీటి నగర్ లోని పోలింగ్ స్టేషన్లో తన తండ్రీ కేశవరావుతో కలిసి ఓటు వేశారు. ఉదయం 11 గంటలకల్లా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 10.70 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, సికింద్రాబాద్ లో 14.77 శాతం, కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికల్లో 16.33 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గం జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి మధ్యాహ్నం ఎండ బాగా ముదరడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల సంఖ్య పలుచగా కనిపించింది. సిటీలోని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటింగ్ చేసిన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. సాయంత్రం 6:00 కల్లా క్యూలోకి వచ్చి నిలబడిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

Advertisement

Next Story