హైదరాబాద్ ఓటర్స్ వెరీ స్లో.. రెండు గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదు అయిదంటే..?

by Satheesh |   ( Updated:2023-11-30 12:24:19.0  )
హైదరాబాద్ ఓటర్స్ వెరీ స్లో.. రెండు గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదు అయిదంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌ల్లో పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఒంటిగంట వరకు అత్యధికంగా మెదక్‌లో 50 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 20 శాతం మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌లో అన్ని జిల్లాల కంటే పోలింగ్ శాతం నమోదు కావడంతో ఓటు వేసేందుకు నగర ఓటర్లు బయటకు రావాలని ఈసీ పిలుపునిచ్చింది. అయితే, పోలింగ్ వేళ రాజధాని ఓటర్లు ఇంట్లో నుండి బయటకు వెళ్లరని.. ఓటు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారనే ఒక అపవాదు ఎప్పటి నుండో ఉంది.

గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ గణంకాలు కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అన్నింట్లో ముందుండే రాష్ట్ర రాజధాని ఓటర్లు.. ఓటు వేయడంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేస్తున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. అక్షర్యాసత తక్కువ ఉండే పల్లెలా ఎన్నికలను పండుగలా భావించి గ్రామీణులు పెద్ద ఎత్తున ఓటింగ్ వేస్తుంటే.. ఎక్కువ చదువుకున్న వారి ఉండి.. ఓటు విలువ ఏంటో తెలిసిన అర్బన్ ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు బయటకు రావడం లేదు. ఇకనైనా ఈ అపవాదును చెడగొట్టేలా ఈ సారైనా నగర ఓటర్లు ఇళ్ల నుండి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed