- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారం రోజుల్లో పోలింగ్.. BRSకు కోలుకోలేని దెబ్బ..
దిశ, అలంపూర్ : అలంపూర్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం కాంగ్రెస్ పార్టీ పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం 9 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రీసెంట్‌గా MLA అబ్రహం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు టిక్కెట్టు ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెడుతున్నారని విమర్శలు చేసారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించి బీఆర్ఎస్ పార్టీకి వెన్నంటే ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం బాదేసిందన్నారు. బీఆర్ఎస్ జెండా మోయని వ్యక్తికి టికెట్ ఇచ్చి తనను అవమానపరచడంతో సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. కానీ.. అలంపూర్ అభివృద్ధి, సంక్షేమం కోసం తాను నమ్ముకున్న ప్రజల పిలుపు మేరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యమని భావించి అలంపూర్ ప్రాంత అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు 9 గంటలకు జాయినింగ్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే అబ్రహం వెంట కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రకాష్ రెడ్డి ఉన్నారు. అబ్రహం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ విజయం ఖాయం అయినట్టు అని వార్ వన్ సైడ్ అన్నట్లుగా కనిపిస్తుందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.