- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుపాకులపై రామగుండం పోలీసుల ఫోకస్.. రంగంలోకి దిగిన సీపీ
దిశ, మందమర్రి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశాలు జారీచేశారు. పార్లమెంట్ ఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోలీసు శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టిందన్నారు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం.. కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్‌లో డిపాజిట్ చేయాలని కమిషనర్ కోరారు.
ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలన్నారు. అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని సీపీ తెలిపారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి తేదీ: 07-06-2024 రోజున తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు.