- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: యూత్‌కు దగ్గరయ్యేందుకు రూట్ మార్చిన పొలిటిషియన్స్.. అన్ని పార్టీలదీ ఇదే ఫార్ములా!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్నాయి. రాజకీయ నేతలు తమ పార్టీ ప్రచారాలకు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా వాడుకుంటున్నారు. దీంతో పొలిటికల్ వార్‌కు సోషల్ మీడియా వేదికగా మారింది. లీడర్లు తమకు అనుకూలంగా పోస్టులను క్రియేట్ చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులను విమర్శించే పనుల్లో బిజీ అయ్యారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా యూత్‌కు దగ్గరయ్యేందుకూ ప్రయత్నిస్తున్నారు. ప్రతిపార్టీ ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసుకున్నదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలైంది. అధికార పార్టీకి చెక్ పెట్టాలని ప్రతిపక్షాలు, మళ్లీ పవర్‌లోకి రావాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో డిజిటల్ ప్రచారానికి పార్టీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి.
ప్రత్యేక విభాగాలు..
పార్టీ లైన్‌కు అనుగుణంగా కంటెంట్‌ను జనాల మెదళ్లలో చొప్పించడమే లక్ష్యంగా అన్నిపార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టి విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నది. బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సైతం ప్రత్యేకంగా ఒక వింగ్‌ను ఏర్పాటు చేసుకున్నది. మొత్తం 120 మందిని నియమించుకొని షిఫ్టుల వారీగా పని చేయిస్తున్నది. కాంగ్రెస్ వార్ రూమ్‌ను పెట్టుకున్నది. ఇలా ఎన్నికల ముంగిట అన్ని పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు పొలిటికల్ వార్‌కు తెరలేపాయి.
పంచులు.. సెటైర్లు
రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, తప్పిదాలను ఎత్తి చూపుతూ పంచులు, సెటైర్లు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసేందుకు అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది. సోషల్ మీడియా వేదికగా కేంద్రంపై తరచూ విమర్శలు చేస్తున్నది. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు ఎవరు వచ్చినా సెటైరికల్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో వెరైటీగా వెల్ కం చెబుతున్నది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ సందర్భంగా వాషింగ్ పౌడర్ నిర్మా పేరిట పోస్టర్లు ఏర్పాటు చేసి వెల్ కమ్ చెప్పింది. దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కూడా చేసింది. బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోశ్ కనిపించడంలేదని, పట్టించిన వారికి రూ.15 లక్షల రివార్డు పేరిట పోస్టులు పెట్టారు. కాగా, లిక్కర్ స్కామ్‌లో కవిత హస్తంపై సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు దర్శనమిచ్చాయి. ఇలా పోటాపోటీగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.
Also Read: బీఆర్ఎస్‌కు మైలేజీ వస్తుందనుకుంటే.. అదే మైనస్ అయ్యిందా?