- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది మంత్రులు చనిపోతారు.. పంచాంగ శ్రవణంలో జ్యోతిష్యుడి వెల్లడి
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు వారి కొత్త ఏడాది ఉగాది పండగను ప్రజలు ఘనంగా జరుగుపుకుంటున్నారు. క్రోధి నామ సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. దీంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడగా పంచాంగ పఠనాలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రధాన పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం ఆసక్తిగా మారింది. పార్టీ కార్యాలయాల్లో జరిగిన అయ్యవార్ల పంచాంగ శ్రవణంలో ఈ ఏడాది తీపి ఎవరికి? చేదు ఎవరికి? పులుపు ఎవరికో ఓ లుక్కేద్దాం..
పరశురాముడిలా రేవంత్ పనితీరు..
గాంధీభవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో చిలుకూరి శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి పరశురాముడిలా పని చేస్తారని చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని ఇది శుభపరిణామమని అన్నారు. రేవంత్ గత అక్టోబర్ నుంచి సింహంలా పనిచేశారని క్రోధి నామ సంవత్సరంలో కూడా మంచి జరుగుతుందని, రాష్ట్రాల్లో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందని, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రాబోతున్నదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి కూడా రాజయోగం ఉందని, ప్రధానమంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయన్నారు. మంత్రుల మరణాలతోపాటు ఈ ఏడాది ఓ పత్రిక యజమాని అనారోగ్యంతో చనిపోతారని చెప్పారు. రాజకీయనేతలు కూడా శిక్షార్హులు అవుతారన్నారు.
కేటీఆర్ మాటను కట్టడి చేసుకోవాలి...
తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకల్లో కేటీఆర్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. రాబోయే ఎన్నికల్లో పాలకపక్షాలకు కష్టాలు కనిపిస్తున్నాయని, ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నం చేస్తే దిగ్విజయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్ రాశిలో(కర్కాటకం) అత్యంత సంతోషకరంగా ఆదాయ, వ్యయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. వారి మాటకు, గమనానికి అడ్డు ఉండదని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దన్నారు. మకర రాశి(కేటీఆర్) ఆదాయ, వ్యయాలు సమానమని, రాజపూజ్యం, ప్రజాబలం బాగుందని అవమానాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మాటను కట్టడి చేసుకోవాలని లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రయాణాలలో ఇబ్బంది ఉంటుందన్నారు.
అధినాయకత్వం వల్ల విజయాలు..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు పార్టీ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది వ్యక్తుల మధ్య అకాల వైరాలు పెరిగినా అధినాయకత్వం వల్ల ఒకటిగా కలిసిపోతారని సమిష్టి విజయం సాధించాలనే లక్ష్యం ఏర్పడుతుందన్నారు. సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.
కేసీఆర్ మూడో నేత్రం.. ట్యాపింగేనా?
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం రేపుతున్న వేళ రెండేళ్ల క్రితం నాటి పంచాంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనాటి ఉగాది వేడుకల్లో సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపిస్తూ.. నరసింహుడికి త్రినేత్రం ఉన్నట్లుగానే కేసీఆర్‌కు కూడా మూడవ నేత్రం ఉందన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారన్నారు. అయితే పదవిలో ఉండగా బీఆర్ఎస్ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరుల ఫోన్ కాల్స్ విన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేసీఆర్ మూడో నేత్రం ఫోన్ ట్యాపింగే అంటూ సెటైర్లు వేస్తున్నారు.