- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కవిత చేతిలో రాజకీయ పుస్తకాలు.. ఈడీ కస్టడీలో ఆ నేతల జీవిత చరిత్రలు తిరగేస్తున్న ఎమ్మెల్సీ
దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్యాత్మిక చింతన, పుస్తక పఠనంతో తన దినచర్య కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయగా రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ లో కవితను ఉంచిన అధికారులు అదే కార్యాలయంలో విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కవిత విరామ సమయంలో ఆధ్యాత్మిక చింతన, పుస్తకాల పఠనంతో బిజీగా ఉంటున్నట్లు తెలిసింది. బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్ష కొనసాగించగా ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పండ్లను అందించారు.
కవిత చేతిలో పొలిటికల్ బుక్స్:
ఇదే సమయంలో కవిత కీలకమైన పుస్తకాలు పఠిస్తున్నట్లు తెలుస్తోంది. అంబేద్కర్ జీవిత గాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రచించిన 'కరుణానిధి-ఏ లైఫ్', శోభన్ కే నాయర్ రచించిన 'రాం విలాస్ పాశ్వాన్- ది వెదర్వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్' స్వామి సర్వ ప్రియానంద రాసిన 'భగవద్గీత' వంటి తన దిన చర్యలో భాగంగా చదువుతున్నారు. పుస్తకాలు, నోట్స్ బుక్స్, పెన్నులను ఇప్పటికే ఈడీ అధికారులను అడిగి తెప్పించుకున్న కవిత ఆ పుస్తకాల్లోని కీలక అంశాలను డైరీలో నోట్ చేసుకుంటున్నారట.