TG Police: మీ కోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ.. తెలంగాణ పోలీస్ వినూత్న హెచ్చరిక

by Ramesh N |   ( Updated:2025-01-01 12:50:16.0  )
TG Police: మీ కోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ.. తెలంగాణ పోలీస్ వినూత్న హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేడుకల (New Year celebrations) సందర్భంగా నగరంలో కొంత మంది మద్యం సేవించి వాహనాలు నడపడం, న్యూసెన్స్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం చేస్తుంటారు. అలాంటి వారికి కోసం తెలంగాణ పోలీస్ (Telangana Police) ఎక్స్ వేదికగా వినూత్న హెచ్చరికలు పోస్ట్ చేసింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ కోసం పోలీసులు నిర్ధేశించిన మార్గదర్శకాలను పాటించండని సూచించారు. ఇతరులను ఇబ్బంది పెట్టినా, డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ (Drunk and drive) చేసినా, డ్రగ్స్‌ వాడినా జైలుపాలవ్వక తప్పదని హెచ్చరించారు. నిబంధనలను పాటించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ‘మీ కోసం జైల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెడీ, ప్రత్యేక ఆహ్వానితులు.. తాగి వాహనం నడిపేవాళ్లు, రోడ్లపై స్టంట్లు, అల్లరి చేసేవాళ్లు, ముఖ్య అతిథులు డ్రగ్స్ సేవించే వ్యక్తులు, మీ కోసం తెలంగాణ పోలీసులు బేడీలతో రెడీగా ఉన్నారు. సహాయం కోసం డయల్ 100 ను సంప్రదించండి’ అంటూ వినూత్న తీరులో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed