- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతనకల్‌లో కార్డన్ సెర్చ్.. 14 వాహనాలు సీజ్
దిశ, నూతనకల్: తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా నూతనకల్ మండల కేంద్రంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లీ గల్లీని పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంకు దగ్గర ఏర్పాటుచేసిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. యువత వాహనాలు పరిమిత వేగంలో నడపాలని సూచించారు. అతివేగంగా వెళ్లి ప్రమాదాల పడకూడదని అన్నారు. సంఘ విద్రోహులు నివాసం ఉండడం, కాలనీల్లో సంచారం చేసే అవకాశాలు ఉంటాయని, వారికోసమే తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. గంజాయి, గుట్కాలను నిషేధించడానికి కార్డన్ నిర్వహిస్తున్నామని అన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలకు చలాన్లు విధిస్తామని తెలిపారు. కేంద్రంలోని 12 బైకులు, ఒక త్రీ వీలర్, ఒక ఫోర్ వీలర్ వాహనాలను సీజ్ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ ఎస్ఐ వై.ప్రసాద్, తుంగతుర్తి ఎస్ఐ ఆంజనేయులు, మద్దిరాల ఎస్ఐ వెంకన్న, నాగారం ఎస్ఐ హరికృష్ణ, చివ్వెంల ఎస్ఐ ఇబ్రహీం, ఆయా స్టేషన్ల ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లు తదితరులు పాల్గొన్నారు.