- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
35 ఏళ్ల తర్వాత ఆ రెండూ ఒకేరోజు వచ్చాయి.. హోలీ వేళ నగర ప్రజలకు CP కీలక సూచన

దిశ, వెబ్‌డెస్క్: హోలీ పండుగ(Holi Festival) వేళ హైదరాబాద్ మహా నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Police Commissioner CV Anand) కీలక సూచనలు చేశారు. అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత హోలీ(Holi), రంజాన్ మాసం(Ramadan Month)లోని రెండో శుక్రవారం ఒకే రోజు వచ్చాయి.. అందుకే ప్రతిజోన్‌లోని ముఖ్య ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేశాం.. రెండు పండుగలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నామని సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) చెప్పారు.
మరోవైపు హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు(Police Restrictions) విధించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు విధించారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని, వాహనదారులపై రంగులు చల్లొద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.