- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ కరీంనగర్‌లో సంచలనం.. రూ.6.65 కోట్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డబ్బు సీజ్?
దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలీసులు అర్థరాత్రి నుండి తనిఖీలు చేస్తున్నారు. భారీగా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని రూ.6 కోట్ల 65 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. అయితే, ఈ డబ్బు ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎన్నికల్లో పంచేందుకే తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతిమ హోటల్స్‌కు కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలన్నీ ఈ హోటల్ కేంద్రంగానే జరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. నగదు పట్టుబడిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరోవైపు సీజ్ చేసిన డబ్బులను కోర్టులో సమర్పిస్తామని ఏసీపీ నరేందర్తెలిపారు.