బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో Narendra Modi పర్యటన వాయిదా

by Mahesh |   ( Updated:2023-01-11 06:08:48.0  )
బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో Narendra Modi పర్యటన వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 19 న మోడీ హైదరాబాద్ కు రావాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, వందేభారత్ రైలును మోడీ ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు ప్రధాని చేత పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మోడీ పర్యటనకు సంబంధించి రైల్వే అధికారులతో రాష్ట్ర బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. మీటింగ్ కోసం పరేడ్ గ్రౌండ్ ను సైతం పర్యవేక్షించారు. అయితే జనవరి 16,17 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇతర పనుల కారణంగా ప్రధాని మోడీ పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : రాష్ట్రానికి తొలిసారి కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్.. వీహెచ్ ఆందోళన

Advertisement

Next Story