స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటున్న తెలంగాణ లీడర్లు, అధికారులు.. ఆ టెన్షన్ పోయిందా?

by GSrikanth |
స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటున్న తెలంగాణ లీడర్లు, అధికారులు.. ఆ టెన్షన్ పోయిందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లీడర్లు, ఆఫీసర్లలో ఫోన్ ఫోబియా పోయింది. ఇప్పుడు స్వేచ్ఛగా నార్మల్ కాల్స్ మాట్లాడుకుంటున్నా రు. రాజకీయ, అధికారిక అంశాలను సైతం ఫోన్లలోనే షేర్ చేసుకుంటున్నారు. గతంలో తమ కాల్స్ టాప్ అవుతున్నాయనే భయంతో నార్మల్ కాల్స్ మాట్లాడేవారు కాదు. కొత్త ప్రభు త్వం వచ్చిన తరువాత పరిస్థితులు మారాయనే ధీమాతో అందరూ నార్మల్ కాల్స్‌‌లోనే సంభాషిస్తున్నారు.

గతంలో వాట్సాప్, ఫేస్ టైమ్, సిగ్నల్ కాల్స్

కేసీఆర్ పాలనలో తమ కాల్స్ టాపింగ్ అవుతున్నాయని విపక్షాలు చాలా సార్లు ఆరోపణలు చేశాయి. తమ మధ్య జరిగే సంభాషణలు, పొలిటికల్ ప్లానింగ్ వింటున్నట్టు విమర్శలు చేశాయి. అధికారుల యాక్టివిటీస్ తెలుసుకునేందుకు ఫోన్స్ టాప్ చేస్తున్నట్టు ప్రచారం ఉండేది. దీనితో చాలా మంది నార్మల్ కాల్స్‌లో మాట్లాడటం మానేశారు. వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడేవారు. అయితే వాట్సాప్ కాల్ రికార్డు చేసే అవకాశం ఉందని టాక్ రావడంతో, ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్ కాల్స్‌లో మాట్లాడేవారు. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏ, పీఎస్‌ల ఫోన్లు సైతం టాపింగ్ అవుతున్నట్టు ప్రచారం ఉండేది. ఎందుకంటే గతంలో ఓ మాజీ మంత్రి వద్ద పనిచేసిన పీఏ బీజేపీ గురించి అనుకూలంగా మాట్లాడారని అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది.

ఊపిరి పీల్చుకుంటున్న గులాబీ లీడర్లు

గతంలో షేస్ టైమ్ కాల్స్ మాత్రమే చేసే మాజీ మంత్రులు, గులాబీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నార్మల్ కాల్స్ చేసి పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు. తమ అనుచరులు, ఎమ్మెల్యేలు, లీడర్లకు సైతం నార్మల్ కాల్ చేసి రాజకీయ అంశాలను చర్చిస్తున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను ఫోన్‌లోనే పరస్పరం వెల్లడిస్తున్నారు.

అందరూ నార్మల్ కాల్స్‌లోనే

గతంలో ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్ కాల్స్‌లో మాత్రమే మాట్లాడే ఆఫీసర్లు, విపక్షాలకు చెందిన లీడర్లు ఇప్పుడు ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు నార్మల్ కాల్స్ చేస్తున్నారని ఆరా తీస్తే, ప్రస్తుతం కాల్ టాపింగ్ ఉండదని ధీమా తమకు ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న అంశం మాట్లాడినా తెల్లారే రియాక్షన్ ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఫోన్ టాపింగ్ చేసే అవసరం ఉండదని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడా అవసరం లేదు: ఓ మాజీ మంత్రి అభిప్రాయం

వాట్సాప్ కాల్‌లో మాత్రమే మాట్లాడేవాళ్లం. ఏం మాట్లాడితే ఏం అవుతుందోననే భయం ఉండేది. కానీ ఇప్పుడు అన్ని విషయాలను నార్మల్ కాల్ చేసి మాట్లాడుతున్నాను. పార్టీనే ఓడిపోయింది.. ఇప్పుడు నా ఫోన్ వినే అవసరం రూలింగ్ పార్టీకి ఉండదు.

ప్రస్తుతం అన్నీ నార్మల్ కాల్సే: ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభిప్రాయం

నా ఫ్రెండ్ ఫోన్ చేసిన సమయంలో పిచ్చాపాటిగా జరిగిన సంభాషణల్లో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ చిన్న కామెంట్ చేశా. దానికి నాకు పెద్ద క్లాస్ ఇచ్చారు. ప్రస్తుతం ఫోన్ టాపింగ్ అవుతుందనే భయం లేదు. అందుకే నార్మల్ కాల్స్‌లో మాట్లాడుతున్నాను.

Advertisement

Next Story

Most Viewed