- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టైఫండ్ పెంచకపోతే ‘స్ట్రైకే’.. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అల్టిమేటం..!
దిశ, తెలంగాణ బ్యూరో: పీజీలకు 15 శాతం స్టైఫండ్‌ను వెంటనే పెంచాలని జూనియర్ డాక్టర్స్అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి రెండేళ్లకోకసారి పెంచాలనే రూల్ ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే మంత్రి హరీష్, సెక్రటరీ రిజ్వీ, డీఎంఈలను కలసి రిక్వెస్ట్ చేశామని, కానీ ఎలాంటి ఫలితం రాలేదన్నారు. మరోవైపు ప్రతి నెల రెండో వారంలో స్టైఫండ్ ఇస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఆ సమయానికి స్టైఫండ్ రావడం లేదని పీజీలు చెబుతున్నారు. దీంతో ఏప్రిల్ 10 వరకు ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తామని, అప్పటికీ పరిష్కరించకపోతే ఏప్రిల్ 11 నుంచి అన్ని ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహా, మిగతా అన్ని సేవలను బహిష్కరిస్తామని జూనియర్డాక్టర్స్అసోసియేషన్మంగళవారం ఓ ప్రకటనను రిలీజ్చేసింది.
నీట్ 2021 బ్యాచ్ నుంచి ప్రతి పీజీ విద్యార్ధి సెకండ్ ఇయర్‌లో డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ ప్రోగ్రామ్(డీఆర్‌పీ) చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కోర్సులో భాగంగా మూడు నెలల పాటు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలి. అయితే పీజీలకు అవసరమైన వసతి, ఇతర సౌకర్యాలను ఆయా స్టేట్ గవర్నమెంట్‌లు కల్పించాలని ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ సౌకర్యాలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదని పీజీలు చెబుతున్నారు. కేరళ, ఆంధ్రలో మాత్రం ఈ రూల్‌కు బదులు అలవెన్స్ఇస్తూ పీజీలకు డీఆర్ ప్రోగ్రామ్‌లను హోం టౌన్‌లో ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కనీసం ఆ సౌకర్యం కూడా అందుబాటులో లేదని పీజీలు విమర్శిస్తున్నారు. తమతో సేవ చేయించుకుంటూ సమస్యలు పరిష్కరించకపోవడం సరికాదని పీజీలు వెల్లడించారు.