- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
PGECET Counselling: ఫార్మసీ కాలేజీల అప్రూవల్ ఆలస్యమే కారణం
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఫార్మ్ డీలో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు కన్వీనర్ రమేశ్ బాబు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజీల అప్రూవల్ ప్రక్రియను ఆలస్యం చేయడం వల్లనే రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. పీజీఈసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, అలాగే సర్టిఫికెట్లను కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని సూచించారు. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తవుతుందన్నారు.
ఎలిజిబుల్ అభ్యర్థుల జాబితాను ఈనెల 25న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 29న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌కు చాన్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా సెప్టెంబర్ 1వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సూచించారు. సెప్టెంబర్ 2 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.