PG ECET Counseling: పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే

by Satheesh |
PG ECET Counseling: పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఫార్మ్ డీలో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ రమేశ్ బాబు శుక్రవారం ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ శనివారం రానుండగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 9 వరకు ఇది కొనసాగనుంది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగనుంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 17న ప్రొవిజినల్ లిస్ట్‌ను వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయనున్నారు. కాగా సీట్లు పొందిన విద్యార్థులు వచ్చేనెల 18 నుంచి 21 వరకు సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరై సీటు కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.

సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానుందని పీజీఈసెట్ కన్వీనర్ రమేశ్ బాబు తెలిపారు. వచ్చేనెల 20 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. 25, 26 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 27న తప్పొప్పుల సవరణకు చాన్స్ ఇచ్చారు. ప్రొవిజినల్ లిస్టును 30వ తేదీన వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరై సీటు కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఆగస్టు 31వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని కన్వీనర్ స్పష్టంచేశారు. కాగా ఇతర వివరాలకు http://pgecetadm.tsche.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.



Next Story