హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టులో పిటిషన్

by M.Rajitha |
హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయరాదంటూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ తీర్పును ఈ ఏడాది కూడా కొనసాగించాలంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా దీనిపై బాధ్యతలు తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్ ను ప్రతివాదిగా చేర్చారు పిటిషనర్. ఈ పిటిషన్ పై రేపు వాదనలు వింటామని హైకోర్ట్ తెలిపింది. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, అనేక రసాయనాలు కలిసిన రంగులతో తయారు చేయబడిన వేలకొద్ది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం వల్ల సాగర్ అధికంగా కలుషితం అవుతుందని.. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు చేయరాదంటూ గత ఏడాది హైకోర్టు తీర్పు వెల్లడించింది. మరి ఈ ఏడాది వినాయక నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో ఉంటాయో లేదో అనేది రేపు కోర్టులో తెలనుంది.

Advertisement

Next Story

Most Viewed