జనగామ మెడికల్ కాలేజీకి పర్మిషన్​

by Mahesh |
జనగామ మెడికల్ కాలేజీకి పర్మిషన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ ​మెడికల్ ​కమిషన్ ​పర్మిషన్​ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ లకు అనుమతులు రాగా, జనగామ కాలేజీతో ఈ ఏడాదికి ఏకంగా 5 మెడికల్​ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మరో నాలుగు కాలేజీల అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గతేడాది 8 మెడికల్​కాలేజీలు షురూ కాగా.. ఈ ఒక్క ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. అయితే జిల్లాకో మెడికల్​కాలేజీ ఏర్పాటు దిశగా సర్కార్​సక్సెస్​సాధిస్తుందని మంత్రి హరీష్​రావు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story