- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెట్రోస్టేషన్స్‌పై నుంచి స్కైవాక్స్ ఓకే! ఇక పై నేరుగా ప్రైవేట్ భవనాలకు మార్గం!

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro Rail) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం, రవాణా వ్యవస్థను బలోపేతం కోసం మెట్రో స్టేషన్‌ల నుంచి స్కైవాక్ వంతెనలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కై వేల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్ల పై నుంచి స్కైవాక్ వంతెనలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగానే మెట్రో స్టేషన్ల పై నుంచి సమీపంలోని ప్రైవేటు వాణిజ్య, నివాస సముదాయాలకు స్కైవాక్‌లు నిర్మించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని మెట్రో ఎండీ నిర్ణయించారు.
మెట్రో స్టేషన్‌ల నుంచి రోడ్డు దాటేలా కూడా పై వంతెనలు ఉపయోగపడుతాయని అధికారులు తెలిపారు. హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారుల సమావేశం జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. మెట్రో పై వంతెనలు ఏర్పాటు.. ప్రైవేట్ భవనాలకు మార్గం ఇవ్వడంతో ఉద్యోగులకు, షాపింగ్ చేసే వారికి సమయం ఆదా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో వ్యవస్థ మరో ముందడుగు వేయబోతోంది. కాగా, ఇప్పటికే ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద విషాలమైన స్కై వాక్ నిర్మాణం గురించి అందరికీ తెలిసిందే.