వణుకు పుట్టిస్తున్న వైరల్ ఫీవర్స్

by Javid Pasha |
వణుకు పుట్టిస్తున్న వైరల్ ఫీవర్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ వణుకు పుట్టిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు సోకి దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులతో జనం బాధపడుతున్నారు. దీంతో జనం ఆసుపత్రులకు క్యూకట్టారు. ఒక్క హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలోనే 400కు పైగా జ్వర పీడితులు ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులు, మండల కేంద్రాల్లోని ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోను జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆసపత్రుల్లోని పిల్లలు, మేల్, ఫిమేల్ వార్డులు రోగులతో నిండిపోతున్నాయి.

రెండు రోజులుగా ఒకే ఆసుపత్రిలో కొడుకు పిల్లల వార్డులో ఉంటే.. తల్లి ఫీమేల్ వార్డులో ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు కానరావడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి జ్వరాల నుంచి ప్రజలను కాపాడాలని జనం కోరుతున్నారు. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

Next Story