అసెంబ్లీ ముట్టడికి యత్నించిన PDSU-PYL నాయకులు

by Mahesh |   ( Updated:2024-07-31 07:18:57.0  )
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన PDSU-PYL నాయకులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. PDSU-PYL విద్యార్థి సంఘం నాయకులు ఒక్కసారిగా అసెంబ్లీ గేటు వైపు దూసుకొచ్చారు. పదుల సంఖ్యలో వచ్చిన వారు.. అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలని.. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని.. విద్యాశాఖ మంత్రిని నియమించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను తక్షణమే రూపొందించి, ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అసెంబ్లీని ముట్టడించారు. కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడి వాతావరణ ఒక్కసారిగా గందరగోళంగా మారింది. దీంతో పోలీసులు PDSU-PYL నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story