Raja Singh పై పీడీ యాక్ట్.. అతడిపై 101 క్రిమినల్ కేసులు..

by Javid Pasha |   ( Updated:2022-08-25 11:36:58.0  )
Raja Singh పై పీడీ యాక్ట్.. అతడిపై 101 క్రిమినల్ కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: రాజాసింగ్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న కొద్ది సేపటికి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటి సారి ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదైంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ అరెస్ట్‌పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. రాజాసింగ్ అనేక సార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనపై రౌడీ షీట్ కూడా ఉందని, యూట్యూబ్ వేదికగా రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.

Advertisement

Next Story