- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Pcc Chief: ఎల్లుండి నుండీ పీసీసీ ప్రెసిడెంట్ జిల్లాల పర్యటన.. తొలి టూర్ ఆ జిల్లా నుంచే
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఈనెల 16వ తేదీ నుంచి తాను జిల్లాల్లో పర్యటించబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానన్నారు. మొదటి పర్యటన కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడతామన్నారు. 18న మెదక్ పార్లమెంట్ లో నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. గురువారం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆబిడ్స్ సర్కిల్ వద్ద నెహ్రూ విగ్రహానికి మాజీ ఎంపీ వీహెచ్, తదితరులతో కలిసి మహేశ్ కుమార్ గౌడ్ నివాళి అర్పించారు. అనంతరం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల (Lagacharla) ఘటన వెనుక కుట్ర కోణం ఉందని, దీని వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. లగచర్ల ఘటనపై టి.పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓర్వలేకే ఇలాంటికుట్రలు:
ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటిని తప్పుపట్టడమే పనిగా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. మొన్న మూసీ పునరుజ్జీవంపై విమర్శలు చేశారని ఇప్పుడు లగచర్ల ఫార్మాపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తున్నారన్నారు. లగచర్ల ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
ఏడాది పాలనపై విజయోత్సవాలు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఎలాంటి భేషజాలు లేవు. ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం రాజకీయాలు, మీ అవసరాల కోసం ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవన్నారు. పోలీసులు విచారణలో ఎవరు దోషులుగా ఎవరు తేలితే వారిని ఉపేక్షించవద్దన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగితే మన తర్వాతి తరాలు బాధలు పడతాయన్నారు. మేము తప్పు చేస్తే నిలదీయండి. అంతే తప్ప అభివృద్ధి నిరోధకులుగా మారవద్దన్నారు. కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏడాది పాలన ఉత్సవాలను ప్రతి కార్యకర్త జరుపుకుంటారన్నారు. పార్టీ పరంగా రేపటి నుంచి విజయోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. పార్టీ, ప్రభుత్వం తరపున కార్యక్రమాలు ఉంటాయన్నారు.