- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ మిత్రుల కోసం రూల్స్ బ్రేక్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ తన మిత్రుల కోసం రూల్స్ బ్రేక్ చేస్తూ భవన నిర్మాణాలకు అనుమతులు ఇప్పిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి ఒక తలమానికమని,ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వ సంపదగా కేబీఆర్ పార్కును అనేక మంత్రి సీఎంలు కాపాడారన్నారు. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద కేబీఆర్ పార్క్ నిలిచిందన్నారు.ఏకంగా 16 మంది సీఎంలు కేబీఆర్కు కఠిన నిబంధనలు పెట్టి పార్కును కాపాడినట్లు చెప్పారు.అయితే 2006లో 5 ఎకరాల 30 గుంటల భూమిని రూల్స్ప్రకారం గతంలో కాంగ్రెస్ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు కేటాయిందన్నారు.ఆ తర్వాత 2009లో మెటాస్ సంస్థ వాటాను ఐఎల్ఎంఎస్ సంస్థ కొనుగోలు చేసిందన్నారు.
దాని నుంచి బెంగళూరుకు చెందిన మంత్రి డెవలపర్స్ సంస్థ కొనుగోలు చేసిందన్నారు.అయితే 2012లో జీహెచ్ఎంసీ 3 అంతస్థులకే అనుమతించగా,2016లో అదనపు అనుమతుల కోసం సదరు సంస్థ దరఖాస్తు చేసిందన్నారు.జీ ప్లస్ 7 కు అనుమతి కోరిందన్నారు.చివరకు 2018లో మంత్రి డెవలపర్స్ కు అప్పటి టీఆర్ఎస్ప్రభుత్వం అనుమతించిందన్నారు. అయినా ధనదాహం తీరని సంస్థ, మరిన్ని అంతస్థుల కోసం దరఖాస్తు చేసుకోగా,2022లో భూమి లోపల3 అంతస్తులు, భూమిపైన 12 అంతస్తులకు అనుమతించారన్నారు. ఆ డెవలపర్స్జుట్టు కేటీఆర్చేతిలోకి రావడంతోనే ఇలా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ సంస్థలో కేటీఆర్కు వాటా ఉన్నట్లు చెప్పారు. అసలు కేబీఆర్పార్కు సమీపంలో భారీ భవన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా ఇవ్వడం సదరు సంస్థకు ఇవ్వడంపై ఆశ్చర్యంగా ఉన్నదన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ.. శుక్రవారం మంచిర్యాలలో జరిగే సభను సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు. దీక్షకు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది పార్టీ శ్రేణులు రావాలని పిలుపునిచ్చారు. ఇక మహేశ్వర్ రెడ్డి పూటకో మాట మార్చుతూ కాలం ఎల్లదీస్తున్నాడన్నారు. షోకాజ్ నోటీసుకు స్పందించి ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటా అని పేర్కొన్న మహేశ్వర్రెడ్డి, ఖర్గేను కలవకుండానే బీజేపీలోకి చేరారన్నారు.నిర్మల్ లో కార్యకర్తల సమావేశంలో బీజేపీలోకి వెళ్తున్నానని చెప్పినందుకే షో కాజ్నోటీసులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ఫిషరీస్చైర్మన్ మెట్టు సాయికుమార్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.