- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PCC: లోకల్ ఎలక్షన్స్ లో సీట్లు రాకుంటే ఎమ్మెల్యే టికెట్ కట్.. పీసీసీ చీఫ్ హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించడంతో పాటు పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గాంధీ భవన్ లో ఇవాళ ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో జిల్లా నేతలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాలని ఒక వేళ ఫలితాల వేటలో వెనుకబడితే దానికి బాధ్యత వహించే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కొత్త, పాత నాయకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పదవులు వచ్చిన వారు ఓ మెట్టు దిగి ప్రవర్తించాలని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష అనంతరం కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సమీక్షలు జరగనున్నాయి.
ఆ అధికారులు మా మాట వింటలే:
ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మాట వినడం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పందించిన పీసీసీ చీఫ్.. జిల్లా ఇన్ చార్జి మంత్రులు వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని సూచించారు.