మోదీతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

by Javid Pasha |   ( Updated:2023-11-05 06:44:03.0  )
మోదీతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు ఖరారైంది. శనివారం రాత్రి పవన్ కల్యాణ్‌తో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణపై స్పందించారు. జనసేనకు తొమ్మిది సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సెటిలర్ ఓట్లు, ఆంధ్రా రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను జనసేనకు కేటాయించనుంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లితో పాటు మరో ఏడు స్థానాలను కేటాయించేందుకు బీజేపీ సిద్దమైంది.

ఇప్పటివరకు మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 88 సీట్లకు మూడు విడతలుగా బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇంకా 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. వీటిల్లో 9 స్థానాలను జనసేనకు కేటాయించనుంది. అలాగే పవన్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారు. ఈ 7న తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు. ఈ సభలో మోదీతో కలిసి పవన్ పాల్గొననున్నారని తెలుస్తోంది.

Read more : మాకేం చేస్తారు..? టీ- బీజేపీ అభ్యర్థులకు సవాల్‌గా మారిన ‘ప్రచారం’

Advertisement

Next Story