Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్..జైలుకు తరలింపు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-13 12:20:16.0  )
Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్..జైలుకు తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని పోలీసులు విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచారు. కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ ((Patnam Narender Reddy) విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు(jail)కు తరలించారు. లగచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడికి కుట్ర చేశారన్న అభియోగాలపై నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద అరెస్టు చేశారు. వికారాబాద్ డీటీసీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టుకు తరలించగా కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది.

కోర్టుకు తరలించే క్రమంలో నరేందర్ రెడ్డి అక్కడ ఉన్న మీడియాను చూసి తన అరెస్టు అక్రమమని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో రేవంత్‌ రెడ్డి పరువు తన పరువు నిలుపుకునే క్రమంలో లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆపాదించి కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే లగచర్ల కేసులో పోలీసులు 16 మంది రైతులను అరెస్టు చేయగా, వారికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. వారిని పరిగి సబ్‌ జై లుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed