శాసనమండలి చీఫ్‌ విప్‌గా పట్నం మహేందర్‌ రెడ్డి.. సీఎంను కలిసి విషెస్

by Ramesh N |
శాసనమండలి చీఫ్‌ విప్‌గా పట్నం మహేందర్‌ రెడ్డి.. సీఎంను కలిసి విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనమండలి చీఫ్‌ విప్‌గా పట్నం మహేందర్‌‌రెడ్డి‌ నియామకమయ్యారు. ఈ మేరకు పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే తను చీఫ్ విప్‌గా నియమించిన సందర్భంగా రేవంత్‌రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశానని పట్నం స్పష్టంచేశారు. ఈ సందర్భంగా బొకే అందించి, శాలువాతో సన్మానించి, ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరమేశ్వర్‌రెడ్డి, నేతలు సుధీర్‌రెడ్డి, వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పట్నం మహేందర్‌రెడ్డి పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇచ్చిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగానే చీఫ్ విప్ పదవి ఇవ్వడం గమనార్హం. అయితే, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికైన పట్నం ఇకపై మండలిలో ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీలను సమన్వయం చేయనున్నారు.

Next Story