- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA లాస్య మృతిపై పటాన్‌చెరు పోలీసుల రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు వివరాలు వెల్లడించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక పని నిమిత్తం లాస్య నందిత గురువారం సదాశివపేటకు వచ్చారని చెప్పారు. ఇవాళ ఉదయం టిఫిన్ కోసం కారులో వెళ్లారు. శామీర్‌పేట్ వద్ద లాస్య కారు ఓఆర్ఆర్‌పైకి ఎక్కింది. అలాగే వెళ్తూ సుల్తాన్‌పూర్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి కారు రెయిలింగ్‌ను ఢీకొట్టిందిని పోలీసులు వెల్లడించారు.
అంతకుముందు పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. ‘లాస్య తలకు బలమైన గాయాలు అయ్యాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. లాస్య ఆరు దంతాలు ఊడిపోయాయి. శరీరం లోపల ఎముకలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సీట్ బెల్ట్ పెట్టుకొకపోవడమే తీవ్ర గాయాలకు కారణం’ అని డాక్టర్లు వెల్లడించారు.