బీఆర్ఎస్‌లో చేరిన పాల్యాయి స్రవంతి

by Mahesh |   ( Updated:2023-11-12 07:19:48.0  )
బీఆర్ఎస్‌లో చేరిన పాల్యాయి స్రవంతి
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి చవిచూసిన పాల్వాయి స్రవంతి.. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడంతో ఆయనకే మునుగోడు టికెట్ ఇచ్చింది. దీంతో పాల్వాయి స్రవంతి.. ఈ రోజు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు భారత రాష్ట్ర సమితిలో చేరడం సంతోషంగా ఉందని.. తనకు ఎక్కడైతే గౌరవం లేదో అక్కడ ఒక్క నిమిషం ఉండకూడదని మా తండ్రి చెప్పిన మాటలను గుర్తుంచుకుని ఆ పార్టీకి రాజీనామా చేశాను. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఒక సానుకూలమైన మార్పు అవసరం అన్న ఆలోచనతో మా పార్టీ కార్యకర్తలు నాయకుల అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, భారత రాష్ట్ర సమితవర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్‌తో నడవాలని నిర్ణయం తీసుకున్నానని, నాతోపాటు నడిచి వచ్చిన కార్యకర్తలు నాయకుల భవిష్యత్తు బాధ్యతను కేటీఆర్‌కి అప్పజెప్పి ఆయన మీద విశ్వాసంతో ముందుకు నడుస్తున్నామని పాల్వాయి స్రవంతి తెలిపారు.

Advertisement

Next Story