TG Assembly : అసెంబ్లీలో పల్లా వర్సెస్ మంత్రి తుమ్మల.. రైతు భరోసాపై చర్చలు

by Ramesh N |
TG Assembly : అసెంబ్లీలో పల్లా వర్సెస్ మంత్రి తుమ్మల.. రైతు భరోసాపై చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరో రోజు సాయంత్రం అసెంబ్లీ సమావేశాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు‌ మద్య వాడీ వేడీ చర్చ జరిగింది. తుమ్మల నాగేశ్వర రావు అంత రాజకీయ అనుభవం తనకు లేదని మాజీ మంత్రి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వ్యవసాయం మీద అవగాహన ఉన్న ఆయన ఆ శాఖకు మాత్రం పాలసీ తీసుకురాలేదని విమర్శించారు. వ్యవసాయం మీద పాలసీ లేదన్నారు. గత కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని ఒక పండుగలా చేశామన్నారు. ఎం ఎస్ స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తల సాయంతో వ్యవసాయ పాలసీ తీసుకున్నామని చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారి రైతు బంధు లాంటి స్కీమ్స్ తీసుకొచ్చామని వెల్లడించారు. తాను రైతు బంధు సమితి అధ్యక్షుడిగా తాను పనిచేసినట్లు గుర్తుచేశారు. 70 లక్షల మంది రైతులకు 1,52 లక్షల ఎకరాలకు రూ. 82 వేల కోట్లు 12 సార్లు డైరెక్టుగా రైతులకు ఇచ్చామన్నారు. దేశంలో కాదు.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద డైరెక్ట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అని చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతుల మరణాలు తగ్గాయని తెలిపారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతల్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర రావు ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్ని వాడుకోలేదని తెలిపారు. ఆకరికి విత్తనాలు తెచ్చుకోవడానికి అప్పు పెట్టి వెళ్లి పోయారన్నారు. రైతులకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నా.. పంట నష్టపోయిన రైతులకు మా సర్కార్ అండగా నిలబడిందని ఆయన స్పష్టం చేశారు. పల్లా రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అదే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే మట్లాడుతున్నామని అన్నారు. ఇంతవరకు రైతు భరోసా ఏ రకంగా చేయాలనేది.. ప్రభుత్వ నిర్ణయాలు కాలేదని స్పష్టంచేశారు. రైతులు, రైతు సంఘాలు, నిపుణులతో మాట్లాడుతున్నామని వివరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని రైతులు భావిస్తున్నారని వెల్లడించారు. ఓఆర్ఆర్‌ను తాకట్టు పెట్టి రైతు బంధు ఎన్నికలు నెల రోజులు ఉన్నది అన్నప్పుడు ఇచ్చారన్నారు. రైతు బంధుకు ఈ ప్రభుత్వం వచ్చాక రూ.7,500 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. పంటల బీమా పథకాన్ని తాము చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. దాని విధి విధానాలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. మీతో కూడా చర్చలు జరుపుతాం సూచనలు ఇవ్వాలన్నారు. అన్ని పంటలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి.. రైతులు పంట నష్టపోతే పంటల బీమా పథకం ద్వారా పరిహారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. రైతు భరోసాపై భవిష్యత్తులో చర్చిస్తామని అన్నారు.

బీఆర్ఎస్ ఆపిన పథకాలు పునరుద్ధరించి రైతు లోకానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్నింటిని పూర్తి చేస్తామని అన్నారు. రైతు బంధు విదివిదానాలు తప్పన్నారు. పంట వేసిన రైతుకే భరోసా ఇవ్వాలన్నారు. పంట వేయని వారికి ఇచ్చారనేది అపవాది ఉందన్నారు. రూ. 25 వేల కోట్లు పంట వేయని భూములకు ఇచ్చారనేది వాస్తవమన్నారు. మా దగ్గర ఆ లెక్కలు ఉన్నాయని వాటిని పంపిస్తామని స్పష్టంచేశారు.

Advertisement

Next Story