పరీక్ష పే చర్చ కార్యక్రమానికి పాలేరు జవహర్ నవోదయ విద్యార్థిని ఎంపిక

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-27 06:53:43.0  )
పరీక్ష పే చర్చ కార్యక్రమానికి పాలేరు జవహర్ నవోదయ విద్యార్థిని ఎంపిక
X

దిశ, కూసుమంచి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమానికి ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన 9తరగతి విద్యార్థిని దారావత్ సంజన ఎంపికయింది. ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది. ఈ రోజు శుక్రవారం ఉదయం 11గంటలకు ప్రధాని మోడీతో చర్చలో పాల్గొననుంది. భారతదేశం నుంచి మొత్తం 400 మంది విద్యార్థులు పాల్గొంటుండగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయిన ఏకైక విద్యార్థి సంజన కావడం విశేషం. విద్యార్థినిని ప్రిన్సిపాల్ చంద్రబాబు, ఆర్ట్ టీచర్ వీరస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

Also Read...

వైరాలో రాజకీయ వేడి.. సీపీఐకి షాక్ ఇచ్చిన విజయబాయి!

Advertisement

Next Story