- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యునిగా పైల కృష్ణారెడ్డి
దిశ, తాడ్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 125 మందిని బీజేపీ కార్యవర్గ సభ్యులను నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కామారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదవులు వరించాయి. ఇద్దరిలో ఒకరు పైలా కృష్ణారెడ్డి ఇంకొకరు డాక్టర్ మర్రి రాంరెడ్డి వీరిద్దరూ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలానికి చెందిన వారు కావడం విశేషం.
వీరిద్దరు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినవారే. పైలా కృష్ణారెడ్డి వైయస్సార్సీపి కామారెడ్డి సెగ్నెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత కాంగ్రెస్ పార్టీ లో చేరారు.కాంగ్రెస్ పార్టీ లో ఇమడలేక బీజేపీ లో చేరి ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పదవి పొందారు. అలాగే మర్రి రామ్ రెడ్డి గతంలో లోక్‌సత్తా పార్టీ ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత లోక్‌సత్తా పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుని పదవి దక్కించుకున్నారు. ఓకే జిల్లా ఒకే సెగ్మెంట్ ఒకే మండలం నుంచి ఇద్దరికీ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ పదవులు దక్కడం కామారెడ్డి రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి.