రాహుల్ గాంధీకి తెలంగాణ పర్యటనతో కళ్లు తెరుచుకుంటాయి: ఒవైసీ

by Mahesh |   ( Updated:2023-10-18 05:01:58.0  )
రాహుల్ గాంధీకి తెలంగాణ పర్యటనతో కళ్లు తెరుచుకుంటాయి: ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ.. తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రాహుల్ తెలంగాణ పర్యాటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టైల్ లో స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు తెలంగాణ అభివృద్ధి చూసి కళ్ళు తెరుచుకుంటాయన్నారు. 40 ఏళ్లు అధికారంలో ఉండి అమేథీని ఎంత అబివృద్ది చేశారని ప్రశ్నించారు. అలాగే.. 9 ఏళ్లలో తెలంగాణ అమేథీ కంటే ఎక్కువే అభివృద్ధి చెందిందని.. రాహుల్ గాంధీ పర్యటనలో కాళేశ్వరం నీళ్లు, నీళ్లతో పారే కాలువలు, పైప్‌లలో నీళ్లు కనిపిస్తాయని.. ఎటు చూసిన అభివృద్ధి కనిపిస్తుందని ఒవైసీ అన్నారు.

Advertisement

Next Story