Etela Rajender : ‘మా విజయ పరంపర 2019లోనే మొదలైంది’

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-06 16:36:42.0  )
Etela Rajender : ‘మా విజయ పరంపర 2019లోనే మొదలైంది’
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల మండిపడ్డారు. తెలంగాణ గడ్డపై మా విజయ పరంపర 2019 ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామన్నారు. మునుగోడులో నైతికంగా బీజేపీయే గెలిచిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. చాపకింద నీరులా బీజేపీ రాష్ట్రంలో విస్తరిస్తోందన్నారు. ప్రధాని మోడీ సభను విజయవంతం చేస్తామన్నారు.

Revanth Reddy : ప్రతి నియోజకవర్గంలో 12 వేల కాంగ్రెస్ ఓట్లను తొలగించారు

Advertisement

Next Story