- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో పాము కలకలం!
దిశ, డైనమిక్ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవన సమీపంలో పాముల బెడద ఎక్కువ అవుతోంది. నిత్యం పాములు సంచరిస్తుండటంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఆర్ట్స్ కాలేజీ సమీపంలో పాము సంచరించడం కలకలం రేపింది. ఆర్ట్స్ కాళాశాల భవనంలో వెనుక ఉన్న ఎస్ బీఐ బ్యాంకు ఆవరణలో పాము సంచరిస్తూ.. పక్కనే ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న డిపార్టమెంట్ల వైపు వెళ్లసాగింది. దీన్ని గమణించిన విద్యార్ధులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకున్నాడు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.
ఈ ఘటనపై విద్యార్ధులు స్పందిస్తూ.. ఆర్ట్స్ కళాశాల భవనంలో విద్యార్థులు, సిబ్బందికి పాములు నిత్యకృత్యమయ్యాయి అని,. నాగుపాములు నిత్యం నేలమాళిగలోకి ప్రవేశిస్తూ విద్యార్థులు, సిబ్బందికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలోని అధికారులు బేస్‌మెంట్‌లో ప్రవేశాలకు ఎలాంటి భద్రత కల్పించలేదని అంటున్నారు. భవనం యొక్క బేస్‌మెంట్‌లో ఉన్న సైకాలజీ, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగాలు ముఖ్యంగా పాము చొరబాట్ల వల్ల బెదిరింపులకు గురవుతున్నాయని తెలిపారు.