- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశాంతగా ముగిసిన ఉస్మానియా పీజీ ప్రవేశ పరీక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిసాయని టీజీ సీపీ గేట్ 2024 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించినట్టు అయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 పరీక్ష కేంద్రాల్లో మూడు షిఫ్ట్‌లో నిర్వహించారు. పీజీ రెండు, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఈ పరీక్షలను నిర్వహించారు . 45 సబ్జెక్టులో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు మొత్తం 7382 మంది రిజిస్టర్ చేసుకోగా 64,765 మంది విద్యార్థులు హాజరయ్యారు.
47 పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో మొత్తం 51 సబ్జెక్టులకు ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో ఎం. ఏఎంఎస్సీ, ఎం.కాం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎం ఎస్‌డబ్ల్యూ, ఎంఎల్‌ఐసి, ఎం.సి.జే, మాస్టర్ లైబ్రరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్సులతో పాటు ఐదు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి. కాగా ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ పర్సియన్, థియేటర్ ఆర్ట్స్, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ పరీక్షలు నిర్వహించలేదని పేర్కొన్నారు.