- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘BRS ఎమ్మెల్యే జైలుకు వెళ్లాకే నేను హైదరాబాద్‌కు తిరిగి వస్తా’
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జైలుకు వెళ్లాకే తాను హైదరాబాద్‌కు తిరిగి వస్తానని ఆరిజన్ డైరీ ఎండీ శేజర్ శపథం చేశారు. బీఆర్ఎస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో గత శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన శేజల్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీ ఆర్ఎంఎల్ ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఎమ్మెల్యే చిన్నయ్య నాపై తప్పుడు కేసులు పెట్టించాడని ఆయన అనుచరులు నేను డిప్రెషన్ లోకి వెళ్లేలా వేధించారని ఆరోపించారు.
వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల తీరుపై ఆధారను పోలీసులకు అందించినా పోలీసులెవరూ పట్టించుకోలేదన్నారు. ఢిల్లీలోనే ఉండి పోరాటం కొనసాగించబోతున్నట్లు స్పష్టం చేశారు. దుర్గం చిన్నయ్యకు ఆరిజన్ డైరీ నిర్వాహకులకు మధ్య గత కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే తీరుపై ఇటీవలే శేజల్ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే ఆమె సూసైడ్ అటెమ్ట్ చేశారు. కాగా శేజల్ ను తెలంగాణ బీజేపీ నేతలు పరామర్శించారు.