- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీచ రాజకీయాలకు తెరలేపిన విపక్షాలు : మేడే రాజీవ్ సాగర్
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలకు తెరలేపాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేక చావు రాజకీయాలు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను సోమవారం మీడియా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు.
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరణించాలంటూ అరవింద్ అనడం ప్రజలను విస్మయానికి గురి చేశాయన్నారు. అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో రైతులను అండగా నిలిస్తే జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిపై కత్తితో దాడిచేయడాన్ని ఖండించారు. ఎన్నికల్లో గెలిచే దమ్ము లేని వారే ఇలాంటి చర్యలకు పాల్పడుతారని స్పష్టం చేశారు.