- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BRS మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్: మంత్రి హరీష్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరకని పరిస్థితిలో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు హరీష్ రావు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందన్నారు. ప్రజలకు ఏం చెప్పాలో.. ఏం ఇవ్వాలో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకు ఎవరు గ్యారెంటీ అని ప్రజలు అడుగుతున్నారన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకి, హామీలకు కేసీఆర్ గ్యారెంటీ అన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చి తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్న కేసీఆర్‌ను గెలిపించుకుందామని పిలుపు నిచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో సైతం మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని జోస్యం చెప్పారు. గద్వాల్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగిందని, ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు.
గద్వాల్ లో కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించుకుందాం.. అభివృద్ధిని కొనసాగిద్దాం అని పిలుపు నిచ్చారు. కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి. ఎప్పుడూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే పాటు పడతాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో విడుదలలో, ప్రచారంలో ఎట్లైతే ముందు ఉందో వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
చేరినవారిలో ఎంఐఎం కౌన్సిలర్ బంగి ప్రియాంక, గద్వాల్ కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షుడు రఘునాయుడు, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు బంగి సుదర్శన్, ధరూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, కేటి దొడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసీ ఉమాదేవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పూల కర్ణాకర్, అల్క్జాండర్, జిల్లా జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్ తదితరులున్నారు.