Metro: మెట్రోలో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ ప్రకటనలు! సజ్జనార్‌కు నెటిజన్ల కీలక విజ్ఞప్తి

by Ramesh N |   ( Updated:2025-03-16 11:19:41.0  )
Metro: మెట్రోలో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ ప్రకటనలు! సజ్జనార్‌కు నెటిజన్ల కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని (Hyderabad Metro) మెట్రోలో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ ప్రకటనలు ఇవ్వడంపై సమాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్‌కు ఎక్స్ వేదికగా యూజర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు తరుణ్ రెడ్డి అనే యూజర్ ట్వీట్ చేస్తూ.. ‘ఎందరినో బలి తీసుకొని ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ బెట్టింగ్ మహమ్మారిపై, వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్స‌ర్లపై మీరు గత కొన్ని రోజులుగా చేస్తున్న పోరాటానికి ధన్యవాదాలు సార్. అయితే మీరు ఒకవైపు ఈ మాఫియాపై యుద్ధం చేస్తుంటే మరోవైపు రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణించే మన హైదరాబాద్ మెట్రోలో ఈ రకమైన బెట్టింగ్ ప్రకటనలు ఉన్నాయి. ఇలాంటి నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ ప్రకటనలకు హైదరాబాద్ మెట్రో ఎలా అనుమతులు ఇచ్చింది? దయచేసి దీనిపై చర్యలు తీసుకోగలరు’ అని పేర్కొన్నారు. మెట్రోలో బెట్టింగ్ గేమ్ ప్రకటనలపై నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Next Story

Most Viewed