TG Govt: యాక్షన్ లోకి సర్కార్.. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యాసంస్థల సందర్శన, ఆకస్మిక తనిఖీలు

by Prasad Jukanti |
TG Govt: యాక్షన్ లోకి సర్కార్.. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యాసంస్థల సందర్శన, ఆకస్మిక తనిఖీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ప్రభుత్వం (Telangana Govt) యాక్షన్ లోకి దిగింది. విద్యార్థుల భోజనం విషయంలో అలసత్వాన్ని సహిచడమని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేయగా గురుకుల విద్యాసంస్థలు, హాస్టళ్లు, పాఠశాలలు, విద్యార్థుల ఎడ్యుకేషన్ వారి ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల ఇన్ చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, విద్యా కమిషన్, విద్యాశాఖ అధికారులు,గురుకులాల సెక్రటరీలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు విద్యా సంస్థలు, హాస్టళ్లు, పాఠశాలలు సందర్శించాలని సీఎం ఆదేశారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం నాణ్యత లోపిస్తే విద్యాసంస్థలు, హాస్టళ్లలో, పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయా సిబ్బంది అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మంత్రుల, ఎమ్మెల్యేల ఆకస్మిక తనిఖీలు, గురుకాల నిద్రలు కొనసాగుతున్నాయి. అయితే తనిఖీలను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

డిసెంబర్ 7 తర్వాత విద్యా కమిషన్ నివేదిక:
సంగారెడ్డి జిల్లా నుండి విద్యా కమిషన్ గురుకులాలు, హాస్టళ్లు, పాఠశాలల సందర్శనను మొదలు పెట్టింది. గురువారం విద్యాశాఖ కమిషనర్ ఆకునురి మురళి (Akunuri Murali) సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్, కొండాపూర్ కస్తూర్బా స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇక ఈ కమిషన్ డిసెంబర్ 7 వరకు విద్యాసంస్థలు సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిచనున్నది. గత కొన్నేళ్లుగా అనేక గురుకులాలు అరకొర సౌకర్యాలతో అద్దె భవనాలలో కొనసాగుతున్నందున ఆ అంశాలతో పాటు ఈ పర్యటనలో గమనించిన అంశాలను కమిషన్ తన నివేదికలో ప్రభుత్వానికి వివరించబోతున్నది.
Advertisement

Next Story

Most Viewed